కోయిల్ కొండ మండలంలో యువతతో పాటు విద్యావంతుల పోటీ

మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ మండలంలో స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మల్కాపూర్ గ్రామంలో యువతతో పాటు, గ్రామ అభివృద్ధి కోసం సేవ చేస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. బీఏ, బీఈడీ పూర్తి చేసిన విద్యావంతుడు మీదింటి నరేష్ కూడా జనరల్ స్థానమైన 9వ వార్డు నుండి బరిలో దిగారు. రాజకీయాల్లో మార్పు కోసం, గ్రామ అభివృద్ధికై విద్యావంతులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం శుభ పరిణామం.

సంబంధిత పోస్ట్