కంటైనర్ బోల్తా.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్

రాజాపూర్ శివారులోని జాతీయ రహదారిపై ఓ పెట్రోల్ బంకు వద్ద కంటైనర్ డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. కంటైనర్ రహదారిపై బోల్తా పడటంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్