కంకర క్వారీలో పేలుళ్లు.. రైతులు ధర్నా

మంగళవారం, మిడ్జిల్ మండలం చేదుగట్టు తండ సమీపంలోని కంకర క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ గా పేలుడు పదార్థాలను బ్లాస్ట్ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీ నుంచి వెలువడే దుమ్ము, ధూళి కారణంగా చుట్టుపక్కల కిలోమీటరు మేర పంటలు, ఇళ్లు దెబ్బతింటున్నాయని, పేలుళ్ల సమయంలో రాళ్లు పొలాల్లో పడుతున్నాయని రైతులు తెలిపారు. బైరంపల్లి, చేదుగట్టు తాండ, కంచనపల్లి గ్రామాల్లోనూ క్రషర్ల వల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ శివప్రసాద్ రైతులతో మాట్లాడి, ఫిర్యాదు మేరకు క్వారీని పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్