ఆదివారం హన్వాడ మండలంలోని ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు కుమ్మరి నర్సింహా, జిల్లా కోశాధికారి అమ్మ బాలచందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా కావలి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రాఘనాథ్, కోశాధికారిగా నర్సింహా, గౌరవ అధ్యక్షులుగా బాలగోపి, ఉపాధ్యక్షులుగా ఆసీఫ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.