మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నదర్పల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ (6) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్కు వెళ్తూ రోడ్డు దాటుతున్న బాలుడిని మహబూబ్నగర్ నుంచి తాండూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. గాయపడిన రామకృష్ణను 108 అంబులెన్స్ సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు.