మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన శేషయ్య (73), అతని భార్య నవనీతమ్మ (64) దుర్మరణం చెందారు. వీరి కారును వెనుక నుండి వేగంగా వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి కారణాలతో భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్