సోమవారం రాత్రి ఇల్లందు చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా గార్లకు చెందిన ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై వేగంగా ప్రయాణిస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.