మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ మల్లికార్జున ఎంటర్ ప్రైజెస్ చౌరస్తాలో శుక్రవారం ట్రాక్టర్ అదుపుతప్పి విగ్రహాన్ని ఢీకొని బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను తప్పించబోయి రోడ్డు పక్కనున్న విగ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ విగ్రహం ధ్వంసం అయ్యింది. ఈ ఘటనతో న్యూటౌన్ లో భయానక వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.