మహబూబ్‌నగర్: యువతి మిస్సింగ్.. పోలీసుల విచారణ షురూ

మరికల్ మండలంలోని జిన్నారం గ్రామానికి చెందిన కావేరి అనే యువతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదృశ్యమైంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెంది, చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో, తండ్రి మరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్