మహబూబ్ నగర్: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోస్లాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి నీళ్లు పడుతుండగా విద్యుత్తు ప్రమాదానికి గురై కార్తీక్ నాయక్ (19) అనే యువకుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పక్క ఇంటివారు గుర్తించి సమాచారం అందించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కార్తీక్ మరణించాడు. మహబూబ్ ఎంవీఎస్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కార్తీక్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్