నవాబుపేట: చీరతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

నవాబుపేట మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన బేరి అరుణ(28) కు 10 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. ఆమెకు 8 ఏళ్ళ బాబు ఉన్నాడు. బాబు పుట్టాక భర్త చనిపోవడంతో అత్తగారి ఇంట్లోనే ఉంది కూలి చేస్తూ జీవనం సాగిస్తుండేది. ఆదివారం తన చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్