మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని కొనగట్టుపల్లి గ్రామంలో ఆదివారం ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కుర్మయ్య ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, పిల్లల తల్లిదండ్రులు, యువకులు పాల్గొన్నారు.