మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మంగళవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS) జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రవికుమార్‌ను జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాల NCC విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల అభిమానం, గౌరవానికి శ్రీ రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, NCC అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.