మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాపూర్‌లో ఇసుక మాఫియా అరాచకం సృష్టించింది. చెక్‌డ్యాంలో నీళ్లు నిలిచిపోవడంతో ఇసుక తీయడానికి వీలులేదని, అర్ధరాత్రి సమయంలో హిటాచితో చెక్‌డ్యాం ధ్వంసం చేయడానికి యత్నించారు. అడ్డుకున్న రైతును చూసి, హిటాచితో పాటు ఇసుక మాఫియా పరారైంది. చెక్‌డ్యాం పైభాగాన్ని కూల్చడంతో నీళ్లు కిందకు వెళ్తున్నాయి.