మహమ్మదాబాద్ మండలంలోని వెంకటరెడ్డి పల్లి గ్రామపంచాయతీ వడ్డెర కాలనీలో అనారోగ్యంతో మరణించిన వడ్డే నాగమ్మ కుటుంబానికి గ్రామ సర్పంచ్ రామకృష్ణ అండగా నిలిచారు. సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన సోదరుడు, మాజీ సర్పంచ్ రాములు ద్వారా రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. గ్రామ ప్రజలను తన కుటుంబంగా భావిస్తున్నట్లు సర్పంచ్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చెంగలి శేఖర్, పుట్టపాటి ఆంజనేయులు, గంట చెన్నయ్య, మాస గారి శేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.