SV CHARITABLE TRUST Founder & President రమతేజ మహబూబ్నగర్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్య, డిజిటల్ అవగాహన, విద్యార్థుల అభివృద్ధి, అవయవదాన అవగాహన, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యంగా DIPIKA, PRANADA, VASUDA కార్యక్రమాల లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించి, ట్రస్ట్ బ్రోచర్లను అందజేశారు.