నిబంధనలకు విరుద్ధంగా మద్యం టెండర్ దాఖలు చేసినందుకు గాను, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బి. పుష్పను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. అక్టోబర్ 26న కలెక్టర్ నిర్వహించిన మద్యం టెండర్లలో, రూ. లక్షలు చెల్లించి ధర్మాపూర్లోని 16వ నంబరు మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకున్న ఆమెకు లక్కీ డిప్లో టెండర్ దక్కింది. సీసీఎల్ఎ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు టెండర్లలో పాల్గొనకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, శనివారం డీఈవో ప్రవీణ్ కుమార్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.