మహబూబ్ నగర్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.160 నుంచి రూ.170 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.180 నుంచి రూ.190 వరకు పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ.20–30 వరకు తక్కువగా ఉండడం గమనార్హం. ధరలు తగ్గడంతో వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.