ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

మహబూబ్ నగర్: ఒడిశాకు చెందిన అనిల్ సాహో ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో బాలానగర్‌లో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వగ్రామంలోని తన మరదలిని ప్రేమించిన అనిల్‌ను, ఆమె మైనర్ కావడంతో పెళ్లి తర్వాత చేస్తామని తల్లిదండ్రులు మూడు రోజుల కిందట మందలించారు. దీనితో మనస్తాపానికి గురైన అనిల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్