గత సంవత్సరం రుద్రారం గ్రామంలో జరిగిన సంఘటనను మరువకముందే, యన్మన్ గండ్ల గ్రామంలో మరో వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైంది. అయ్యప్ప మాల ధరించిన తన కుమారుడితో పాటు భర్త శబరిమల వెళ్లగా, భార్య ఎల్లమ్మ (25) ఆరేళ్ల శివాని, మూడేళ్ల అఖిల్‌లను వెంటబెట్టుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే వెళ్లిపోయింది. భర్త చెన్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.