గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి డీజేలకు అనుమతులు లేవని గత కొన్ని రోజులుగా పోలీసులు సామాజిక మాధ్యమాల్లో చెబుతున్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఏర్పాటుచేసిన డీజే లను సీజ్ చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ముందస్తు సూచనలు చేసినప్పటికీ, వాటిని ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేసిన 6 డిజే వాహనాల ఓనర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేసి ఆ డీజేలు సీజ్ చేశామని, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.