ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో జనసేన అధ్యక్షుడు మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని ప్రధాన కూడలి లో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, అన్న ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో మక్తల్ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్