మక్తల్ లో బీఎస్పీ నామినేషన్లు దాఖలు

మక్తల్ లోని ఆరు వార్డులకు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు నంబర్లు 1, 2, 3, 9, 10, 12 లలో లావణ్య, జుట్ల భాగ్య, జుట్ల నరేంద్ర, శ్రీ నందిని, పద్మ, సురేందర్ లు నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారని మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కె.వి. నరసింహ తెలిపారు.

సంబంధిత పోస్ట్