నారాయణపేట జిల్లా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన 63వ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.