మక్తల్ మండలంలో భారీ వర్షం, జనజీవనం స్తంభించింది

నారాయణపేట జిల్లా మక్తల్ మండల వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుండి భారీ వర్షం కురుస్తోంది. శనివారం అర్ధరాత్రి నుండి కురుస్తున్నప్పటికీ, ఉదయం ఐదు గంటల నుండి జోరు వాన మొదలైంది. దీంతో పట్టణంలో జనజీవనం స్తంభించింది. వాకర్స్ ఇంటి పట్టునే ఉండిపోయారు. ఎండిపోతున్న దశలో ఉన్న విత్తనాలకు ఈ వర్షం ఊరట కలిగిస్తోందని అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ వర్షం తెల్లవారుజాము నుండి మక్తల్ పట్టణంలో కురుస్తోంది.

సంబంధిత పోస్ట్