నారాయణపేట జిల్లా మక్తల్ అయ్యప్ప దేవాలయం నుండి డిసెంబర్ 20న రాజు గురుస్వామి ఆధ్వర్యంలో 15 మంది స్వాములు శబరిమలకు పాదయాత్ర చేపట్టారు. శనివారం కేరళలోని కుంబ్లీ-కంభం మధ్య భారీ వర్షాన్ని లెక్కచేయకుండా స్వాములు తమ యాత్రను కొనసాగించారు. డిసెంబర్ 12న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటామని, ఇది తమ 22వ సారి పాదయాత్ర అని స్వాములు తెలిపారు. ఈ యాత్రలో గురుస్వాములు విజయ్, అంజి కూడా ఉన్నారు.