మక్తల్: 'ఇందిరమ్మ ఇండ్లను రద్దు చేయడం తగదు'

మక్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని వివిధ వార్డులకు చెందిన 29 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను రద్దు చేయడం తగదని సీపీఎం మండల కార్యదర్శి జిఎస్ గోపి అన్నారు. ఇల్లు రద్దయిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి వినతిపత్రాన్ని అధికారి ఈసూఫ్ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్