రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచువార్ గ్రామ ప్రధాన రహదారి 167 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఉట్కూరు మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన కురువ నాగరాజ్(35) గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం కాచువార్ శివారులో ఉండగా మందలో నుండి ఒక గొర్రె ప్రధాన రహదారిపై రాగా దాన్ని తప్పించబోయే క్రమంలో రోడ్డుపైకి వచ్చిన నాగరాజును హైదరాబాదు నుండి రాయచూరు వెళుతున్న లారీ ఢీకొట్టింది. లారీ టైర్ల కింద నాగరాజు పడడంతో శరీరం చిత్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి ఇద్దరు కొడుకులు, ఒక కూతుర ఉన్నారు. నాగరాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕