నర్వ మండలంలో రాష్ట్ర క్రీడలు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం పర్యటించారు. పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి, లబ్ధిదారుల గృహప్రవేశాలకు హాజరయ్యారు. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు వారి ఇళ్లలో ఏర్పాటు చేసిన విందులో మంత్రి వారితో కలిసి భోజనం చేశారు. సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న మంత్రి తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సిపూర్, రాయికోడ్, జక్కనపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 46 మందికి కల్యాణ లక్ష్మీ, షాధిముబారక్, 40 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.