ఈనెల 24న నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన వేదికైనా మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, పారిశుధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యం, ముఖ్యంగా పిల్లల భద్రత కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.