నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా గ్రామ సర్పంచ్ పిలుపుమేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది డెంగ్యూ మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలోని పలు వార్డుల్లో డ్రైనేజ్ గుండా ఇండ్ల పరిసరాలలో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు కరోనా మహమ్మారి రోజురోజుకు పల్లెల్లో విజృంభిస్తుంది కావున ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి అనవసరంగా బయట తిరగకూడదని ప్రజలకు సూచించారు