నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని మంతన్ గోడ్ ప్రాథమిక పాఠశాలలో 2,3,4వ తరగతి విద్యార్థులకు వేసవి విడిది అభ్యాస పుస్తకాలను DAMO విద్యాసాగర్ బుధవారం పంపిణీ చేశారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను మర్చిపోకుండా ఉండటానికి వేసవి సెలవుల్లో అభ్యాసం అవసరమని ఆయన అన్నారు. శ్రీమతి మంజుల మేడం విద్యార్థులపై ఉన్న మమకారంతో రూ.5000 విలువైన పుస్తకాలను స్వచ్ఛందంగా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.