మక్తల్‌లో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పటేల్ పట్వారి వ్యవస్థలను మార్చి, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పింఛన్లు అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందని కొనియాడారు. రాబోయే రోజుల్లో టీడీపీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్