నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం గొలపల్లి గ్రామంలో నేడు, ఏప్రిల్ 2, 2026న, ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా మొట్టమొదటిసారిగా రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు బుధవారం రాత్రి కృష్ణా నదికి కాలినడకన వెళ్లి జల్ది బిందెతో ఊరేగింపుగా గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు రథోత్సవం జరుగుతుందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని గ్రామస్తులు తెలిపారు.