రాఖీ కట్టడానికి వెళ్లి మహిళ అదృశ్యం

నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గట్టమోళ్ళ ఎల్లమ్మ ఆగస్టు 28న రాఖీ కట్టడానికి గ్రామంలోనే ఉన్న పుట్టింటికి వెళ్ళింది. కాగా ఇంతవరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తల్లి తాయమ్మ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్