నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఎల్లలింగేశ్వర రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం యువకులు రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.