అచ్చంపేట మార్కెట్లో 107మొక్కజొన్న బస్తాల మాయం.. ఆందోళనలో రైతు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం విక్రయానికి తెచ్చిన 107 బస్తాల మొక్కజొన్నలు బుధవారం కనిపించకుండా పోయాయి. బాధిత రైతు జితేందర్ ఈ ఘటనపై గురువారం అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దొంగతనం జరిగిందని ఆయన ఆరోపించారు. దొంగలను గుర్తించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్