మార్చాల గ్రామానికి 70 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

కల్వకుర్తి మండలం మార్చాల గ్రామానికి రెండో విడతలో 70 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు జి. భారతమ్మ తెలిపారు. మొదటి విడతలో 30 ఇళ్లు మంజూరు కాగా, 25 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృషితోనే ఈ ఇళ్లు మంజూరు అయ్యాయని, ఆయనకు భారతమ్మ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్