నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరకొండ రూపేష్ (22) అనే యువకుడు మృతి చెందగా, మునిష్ గౌడ్, చాణక్య అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోదాడ - రాయచూరు ప్రధాన రహదారిపై వెళ్తున్న వారి బైక్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మునిష్ గౌడ్ ను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, చాణక్య కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.