అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో గురువారం ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ నూతన రేషన్ కార్డులు పేదలకు పంపిణీ చేశారు. గత బిఆర్ఎస్ పాలనలో పేదలు పదేళ్లుగా నూతన రేషన్ కార్డులు లేకపోవడంతో రేషన్ బియ్యానికి దూరంగా ఉన్నారని అన్నారు. పుట్టిన పిల్లల పేర్లు నమోదు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులలో పిల్లల పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించిందన్నారు.