అచ్చంపేట: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జాం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో డ్యాం గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలను చూసేందుకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. దీంతో ఘాట్ రోడ్డులో 4-5 కిమీ.. మేర వాహనాలు నిలిచి, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్