నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని సలేశ్వర లింగమయ్య స్వామి దేవాలయం వద్ద ఉన్న అంతుచిక్కని జలపాతం భక్తులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. నల్లమల్ల అడవుల లోతైన ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం ఏడాది పొడవునా చల్లని నీటితో ప్రవహిస్తూ ఉంటుంది. విశేషమేమిటంటే, ఎండాకాలంలో కూడా దీని నీరు ఎండిపోదు. ఈ జలపాతం ఎక్కడి నుంచి వస్తుందో స్పష్టంగా తెలియకపోవడం దీని ప్రత్యేకత.