అచ్చంపేట: కుటుంబ కలహాలతో చెంచు యువకుడి ఆత్మహత్యాయత్నం

ఆదివారం అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ నల్లమల అడవి పరిధిలోని మల్లాపూర్ చెంచుపెంటలో కుటుంబ కలహాల కారణంగా మండ్లి పరమేష్ (24) అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య జరిగిన తగాదాలతో మనస్తాపానికి గురైన పరమేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని 108 అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్