నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శనివారం చంద్రవాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాకాలం ప్రారంభంలోనే కురిసిన ఈ భారీ వర్షాలతో స్థానిక చెరువులు, కుంటలు జలమయమయ్యాయి. చంద్రసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. ఈ వర్షాలు పంటలకు మేలు చేసి, వరి సాగుకు అనుకూలంగా ఉంటాయని స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.