అచ్చంపేట: పెద్దపులి దాడిలో పాడి ఆవు మృతి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో మంగళవారం పెద్దపులి దాడి చేయడంతో చెన్నకృష్ణయ్య అనే రైతుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ. 60 వేల నష్టం వాటిల్లింది. బాధితుడు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పులి అడుగుజాడలను సేకరించారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్