నాగర్ కర్నూల్: సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులపై సమీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, 167K జాతీయ రహదారి నిర్మాణ పనులు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ, తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు.

సంబంధిత పోస్ట్