నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని మన్ననూరులో ఆదివారం శ్రీశైలానికి భక్తులు భారీగా పోటెత్తడంతో 4 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. వీకెండ్ కావడం, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. వాహనాలను క్లియర్ చేయడానికి పోలీసులు, ఫారెస్ట్ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సమయంలో శ్రీశైలం వెళ్లాలంటే సహసం అనే చెప్పాలి.