అచ్చంపేట: సబ్ స్టేషన్ లో భారీ పాము

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలోని 133 కేవీ సబ్ స్టేషన్ లో బుధవారం భారీ పూడు పాము కలకలం రేపింది. సబ్ స్టేషన్ ఆవరణలోని ఓ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పామును చూసి సిబ్బంది భయాందోళనకు గురై వెంటనే స్నేక్ క్యాచర్ సుమన్ కు సమాచారం అందించారు. సుమన్ అత్యంత చాకచక్యంగా పామును బంధించి అడవిలో వదిలిపెట్టారు. సుమన్ మాట్లాడుతూ, రెండు తలల పాము పేరుతో జరుగుతున్న మోసాలను నమ్మవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్