అచ్చంపేట: అక్రమ ఇసుక డంపులు..!

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కన్య తండ పరిసరాల్లో ఇసుక అక్రమ నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం ఇసుక రవాణాపై నిషేధం విధించినా అక్రమార్కులు లెక్కచేయకుండా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక గ్రామాల సమీపంలో పెద్ద ఎత్తున ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారని, నిరంతర తవ్వకాలతో భూగర్భ జలాలు అట్టడుగుకు పడిపోతున్నాయని, తక్షణమే పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్