నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీశైల జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. గురువారం 3 గేట్ల ద్వారా 81,195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద పెరగడంతో ఈ రాత్రి 11 గంటల తర్వాత ఏ సమయంలోనైనా మరో గేటును ఎత్తే అవకాశం ఉంది. కాగా త్రివర్ణ పతాక రంగుల విద్యుత్ వెలుగుల నడుమ కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.